Tuesday, 4 February 2014

మనసు తపన

మనసు తపన

హాయ్ రా ,
నేను రా ,
నీవు అంటే ఏమిటి అని చెప్పే వాడిని
నీవు ఏమటో తెలిసిన వాడిని
నీవు పుట్టినప్పటి నుంచి నీతో నే ఉంటూ ...
నీ జ్ఞనప్పకాలు, అనుభూతులు  అని దాచే వాడినే
నీ కష్టాలలో పాలు పంచుకుంటేనే...
నీకు ఏదో మంచో చెడో చేపితినే ...చిట్టా చివరికి,
నీ కట్టే కాలేట్టప్పుడు కూడా నీతోనే ఉండేవాడిని
అలాంటి నన్నే వదిలేసి...
ఎవరో కోసమో  ఎందుకు అంత ఆరాటం
ఎందుకు అంత ప్రేమ... ముందు నన్ను ప్రేమించటం నేర్చుకో.

Friday, 31 January 2014

ఆమె

 తనొక జ్ఞాపకమై వుంటానంది
నేను వద్దన్నాను

తనొక అనుభూతిగా మిగులుతానంది
నేను కుదరదన్నాను

గుండెల్లొ నిలుస్తానుగా అంది
సదా కళ్ళెదుట వుండమన్నాను

గతమై నా వెనుక వుంటానంది
జత గా నా పక్క నడవమన్నాను

జన్మంటూ వుంటే నీ కోసమే అంది
నీతోటే నేనంటూ..ఈ జన్మకి వీడ్కోలన్నాను

మొదట ఓదార్చింది--తరువాత వివరించింది
బ్రతికి సాధించమంది
సాధించి దానిలో తనను బ్రతికించమంది
కళ్ళు తుడుచుకున్నాను
నాకు దారి చూపుతూ..అనుక్షణం విధిని గుర్తుచేస్తూ
ఎదురుగా నా లక్ష్యం రూపం లో ఆమె.